సంక్రాంతి పర్వదినం సందర్భంగా కోడిపందాల జాతర ప్రకాశం జిల్లాతో పాటు ఒంగోలు నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున సాగుతుంది గురువారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు కొత్తపట్నం ఒంగోలు రూరల్ మండలాలతో పాటు పలు గ్రామాలలో భారీ ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేసి కోడిపందాలను నిర్వహించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా కోడి పందాలు జరిగాయి అయితే ఓవైపు పోలీసులు కోడిపందాలను నిషేధించినప్పటికీ స్థానికంగా ఉండే పోలీసులు మాత్రం వాటిని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో భారీగా ప్రజలు అక్కడికి చేరుకుని జేబులో గుల్ల చేసుకున్నట్టు సమాచారం