బొమ్మనహాల్ మండలం లింగదల్ గ్రామంలో గడ్డివామికి నిప్పు అంటుకోవడంతో పశుగ్రాసం దగ్ధమైంది. బాదిత రైతు ఎర్రిస్వామి తెలిపిన వివరాల మేరకు గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టెడంతో మంటలు బారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే సుమారు రూ. 3 లక్షల విలువైన గడ్డి తగలబడిందని రైతు వాపోయాడు.