శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలో నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించి 41 రోజులు ముగియడంతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించారు. ఆలయ నిర్మాణానికి కృషిచేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.