ఖమ్మం అర్బన్: కలెక్టరేట్లో కామన్ సర్వీస్ సెంటర్ వర్క్షాప్ను ప్రారంభించిన డీఆర్వో పద్మశ్రీ
కామన్ సర్వీస్ సెంటర్లతో ప్రజలకు విస్తృతంగా సేవలు అందుతాయని జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ అన్నారు.గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ వర్క్ షాప్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారిణి మాట్లాడుతూ అభివృద్ధి గ్రామ స్థాయిలో తీసుకుని వెళ్లేందుకు, గ్రామాలలో డిజిటల్ సేవలు మెరుగుపరచడానికి, ఆర్థిక ప్రగతి ఈ గవర్నెన్స్ అందించేందుకు కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.