సూళ్లూరుపేటలో పరమశివునికి ఘనంగా అన్నాభిషేకం
- భక్తుల ఓం నమశ్శివాయ.. హర హర మహాదేవ అంటూ మార్మోగిన ఆలయ ప్రాంగణం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసివున్న శ్రీ గంగా పార్వతి సామెత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భముగా శుక్రవారం పరమేశ్వరునికి పరిమళ పుష్పాలతో అలంకరించి అన్నాభిషేకం పూజలు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ కుమార్ శర్మ అద్వర్యంలో ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షణలో జరిగిన అన్నాభిషేకం మహోత్సవమును పెద్ద సంఖ్యలో భక్తులు హర హర మహాదేవ అంటూ కనులారా వీక్షించి తరించారు. ఆలయమంతా శివనామస్మరణతో మార్మోగింది. ముందుగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అనంతరం స్వామి వారికి అన్నాభిషేకం చేసి వివిధ రకాల పండ్లు,