కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ టీ ఎం నాగరాజు పిలుపునిచ్చారు. గుత్తిలో మున్సిపల్ కార్మికులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పలు డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.