హౌస్ కమిటీ డైరెక్టర్ గా తన నియామకానికి తోడ్పడిన ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన నూతన డైరెక్టర్ అబిద్
Ongole Urban, Prakasam | Mar 30, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గా ఒంగోలు నగరానికి చెందిన మౌలానా ఆబిద్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ జీవో ను విడుదల చేసింది.తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మౌలానా ఆబిద్ సేవలను గుర్తించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆయన పేరును ముఖ్యమంత్రికి సిఫార్సు చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే జనార్దన్ కు పుష్పగుచ్చాను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు