నెల్లిమర్ల: విధుల్లోకి చేరిన మిమ్స్ ఉద్యోగులు, కార్మికులు: జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో సమస్య పరిష్కారం
నెల్లిమర్ల మిమ్స్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె విరమించి శనివారం విధుల్లోకి చేరారు. మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో సమస్య కొలిక్కి వచ్చింది. యాజమాన్యానికి మిమ్స్ యూనియన్ మధ్య ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరడంతో ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. సుమారు రెండున్నర నెలలు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో మిమ్స్ హెచ్ ఆర్ ఇల్లు ముట్టడితో ఉద్యోగులపై కేసులు కూడా నమోదవ్వడంతో పాటు జైలు పాలయ్యారు. సిఐటియు రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించి జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో లేబరు అధికారులుతో మాట్లాడి చట్టపరిధిలో సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు