శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం STU మండల నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. గురువారం మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కార్యవర్గ ఎన్నికల్లో భాగంగా మండల అధ్యక్షుడిగా వేణు గోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయ వర్ధన్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరి ప్రసాద్ రెడ్డి, మహిళా కన్వీనర్గా పద్మజ, మైనారిటీ కన్వీనర్ గా తాబ్రేజ్ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణ నాయక్, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.