కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో రైతు అంజిని రెడ్డికి చెందిన వరిగడ్డి, వేరుశనగ పొట్టు వాములకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నిప్పు పెట్టారు. మంటల్లో వరిగడ్డి వామితో పాటు వేరుశనగ పొట్టు వామి కూడా మంటల్లో కాలిపోయింది. మంటలు ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భారీగా నష్టం సంభవించినట్లు బాధిత రైతు వాపోయాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.