మేడ్చల్: కూకట్పల్లి లో వైసీపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్
వైసీపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్పల్లిలోని తన ఇంట్లో పోలీసులు అరెస్టు చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని ఆమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.