యాదమరి మండలం నారాయణపురం గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. నమోదు చేయని ట్రాక్టర్‌ను సిగ్నల్స్ లేకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్క్ చేయడంతో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న పరదరామి గ్రామానికి చెందిన వెంకటేష్ ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ఉన్నప్పటికీ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. ఫిర్యాదుమేరకు యాదమరి పోలీస్ స్టేషన్లో ఎస్సై ఈశ్వర్ కేసు నమోదు చేసి, ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు చేపట్టారు.