సంగారెడ్డి: చెరువు కట్ట వద్ద వైన్స్ ఏర్పాటు చేయవద్దు : సంగారెడ్డి పట్టణవాసులు కలెక్టర్ కు వినతి
సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని చెరువుకట్టకు ఆనుకుని ఉన్న ప్రధాన రహదారిపై కొత్త మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దని మాజీ కౌన్సిలర్ విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఇప్పటికే రెండు మద్యం దుకాణాలు ఉన్నాయని, మరొకటి ఏర్పాటు చేస్తే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. కొత్త దుకాణం ఏర్పాటు చేయకుండా చూడాలని కోరుతూ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.