ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పేర్నంబట్టు అడవిలో 3 ఏనుగులు చనిపోయాయి. సదానగర్ కొండ సమీపంలోని గుంతలో మృతదేహాలు వెలుగు చూశాయి. రెండు పెద్ద ఏనుగులతో పాటు ఓ పిల్ల ఏనుగు కళేబరాలు నీటిలో కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దంతాల కోసమే వేటగాళ్లు ఏనుగులను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.