వైరా: కారేపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలోని ప్రజావాణిలో సమయపాలన పాటించని అధికారులు, వెనుతిరిగిన అర్జీ దారులు
Wyra, Khammam | Mar 10, 2025 ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను పరీక్షించేందుకు కారేపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అర్జీలు తీసుకునే అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజావాణిలో అర్జీదారులు తమ సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకు వెల్దామానుకుంటే, అధికారులు సమయపాలన పాటించకపోవడం, గైర్హాజరవ్వడంతో వారు చేసేది ఏమి లేక వెను తిరిగి వెళ్లారు.అధికారులు హాజరు కాకపోవడం తో కుర్చీలు బోసిపోయాయి. ఇదే విషయమై డిప్యూటీ తహసీల్దార్ పి. కృష్ణయ్య ను వివరణ కోరగా ప్రజావాణికి సమయపాలన పాటించని