ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా ఎమ్మెల్యే మరియు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నచిన్న పోటీలు నిర్వహించిన ఎమ్మెల్యే సంక్రాంతి సంబరాలను కూడా గురువారం ఘనంగా నిర్వహించారు తెలుగు సంప్రదాయం సంస్కృతి ఉట్టిపడేలా పార్టీ సభ్యులతో పాటు నగర ప్రజలు మరియు యువతీ యువకులు భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా పాల్గొని ఉత్సవాలను నిర్వహించారు సంక్రాంతి సంబరాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు