మునుగోడు: యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి బుధవారం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు.వారితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదన్నారు నేపాల్ లో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యువత పోషించిన పాత్ర ప్రపంచం చూసిందని వారికి దారి చూపియాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందన్నారు .రెండు లక్షల ఉద్యోగుల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.