ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థలాలు కొరకు, కొత్త రేషన్ కార్డుల కొరకు, కొత్త పెన్షన్ల కొరకు 27 అర్జీలు ఎమ్మెల్యేకు ప్రజలు అందజేశారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.