కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకి రైతన్న ఐడి జీవనాడి వంటిదని మార్కాపురం జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ అన్నారు. పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి గ్రామంలో ఏవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ యొక్క ఆవశ్యకతను ఏవో వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతన్న ఐడి ఉండాలన్నారు