భీమిలి: చిల్లర వర్తకులకు ప్రత్యామ్నాయం చూపాలని సిపిఐ కార్యాలయంలో ప్రతిపక్షాలు, వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం.
చిల్లర వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్ల దుకాణాలు ముందస్తు సమాచారం లేకుండా జీవీఎంసీ అక్రమంగా తొలగింపులు ఆపాలని, తక్షణమే వీరందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని, ఆదివారం మధురవాడ సిపిఐ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎ పి మహిళా, ఐద్వా తదితర ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ విశాఖ నగరంలో పొట్ట కూటికోసం కుటుంబాలను పోషించుకునేందుకు చిల్లర వ్యాపారస్తులు చిన్న చిన్న దుకాణాలను, తోపుడు బల్లును ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.