ఖమ్మం అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశం
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ శ్రీజ,శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, పరిశీలించి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అన్నారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.