బొమ్మనహాల్ మండలంలోని రామాంజనేయ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. డీ.హిరేహాల్ నివాసి నరసింహులు శుక్రవారం రాత్రి రాత్రి ఫ్యాక్టరీలో విధులకు హాజరయ్యాడు. శనివారం ఉదయం రన్నింగ్ లో ఉన్న కన్వేయర్ బెల్టు తెగడంతో బెల్టు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదే పరిశ్రమలో గతంలోనూ ఓ కార్మికుడు తీవ్ర గాయాలపాలై కాళ్లు చేతులు పోగొట్టుకున్నాడు.