ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్ ఉన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని తెలిపారు.