నెల్లిమర్ల: ముగిసిన నామినేషన్లు గట్టం: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 16 నామినేషన్లు దాఖలు
నామినేషన్లు గట్టం గురువారం సాయంత్రం 3 గంటలతో ముగిసింది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. జాతీయ పార్టీ అభ్యర్థులు ముగ్గురు, రాష్ట్ర పార్టీలు తరపున ఇద్దరు, గుర్తింపు లేని పార్టీలు తరుపున 8 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున సరగడ రమేష్ కుమార్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఆయన సతీమణి సరగడ లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.