పాకపూడి పోలేరమ్మ దేవస్థానంలో కార్తీక మాస ఆఖరి సోమవారం మంత్రోత్సరణతో మారు మ్రోగింది
పవిత్ర కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా బాలాయపల్లి మండలం పరిధిలోని పాక పూడి గ్రామం శ్రీ పోలేరమ్మ దేవాలయం నందు భక్తులు చేసిన మంత్రోచ్ఛారణ ఆలయ ప్రాంగణంలో మారుమ్రోగింది. తెల్లవారుజామునుంచి గ్రామంలోని ప్రజలు తరలి వచ్చి, కార్తీకదీపాలను వెలిగించి అనంతరం పోలేరమ్మ తల్లిని దర్శించుకుని దేవాలయం ప్రాంగణంలో దీపాలను వెలిగించి , అభిషేకాలు ప్రత్యేక పూజలు, నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకపూడి గ్రామస్తులు పాల్గొన్నారు.