కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో వచ్చే నెల 15న నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని గ్రామస్తులు బుధవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు పెద్దమ్మ విగ్రహ ప్రతిష్టకు రూ. 50,000 విరాళం అందజేశారు. విగ్రహ ప్రతిష్టకు హాజరవుతానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కంబదూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో సరస్వతి మాత, వరసిద్ధి వినాయక ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు కళాశాల అధ్యాపకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. యువత చారిటబుల్ ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు.