మేడ్చల్: మల్కాజిగిరిలో యూనిటీ మార్చ్ మేరా యువభారత్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్
సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్ మేరా యువ భారత్ లో ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆనంద్ బాగ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. అనేకమంది త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు.వారి త్యాగాలను మననం చేసుకోవడం మన కర్తవ్యం అని గుర్తు చేశారు.