శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద శనివారం సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను గురించి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడంపై మండిపడ్డారు. ఈ కోడ్లు అమలు అయితే కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు.