రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు బుధవారం రాత్రి 8 గంటలకు పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇప్పటినుండి ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు 1 నెల రోజుల పాటు జైలు శిక్ష ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. 2025 జనవరి నుండి నవంబర్ 17 వ తేది వరకు 8,051 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ