నెల్లిమర్ల: విజయనగరం పార్లమెంట్ స్థానానికి ముగ్గురు నామినేషన్లు: జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు 18మంది నామినేషన్
విజయనగరం పార్లమెంటు స్థానానికి ముగ్గురు , అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 18 మంది  నామినేషన్లను  దాఖలు చేశారు. ఎంపీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్ధిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. ఆయన నియోజకవర్గ ఆర్ఓ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. అదే పార్టీ తరపున బెల్లాన వంశీకృష్ణ కూడా రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా సియ్యాదుల ఎల్లారావు ఒక సెట్‌తో నామినేషన్ వేశారు.