గుంతకల్లు: గుత్తిలోని ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో గుజరీ, చెత్త వస్తువులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు, ఎగిసిపడుతున్న మంటలు
గుత్తి లోని ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో ఆదివారం సాయంత్రం గుజరీ,చెత్త వస్తువులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు భారీగా చెలరేగాయి. మంటలు, పొగలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల పరిశ్రమలు, విద్యుత్తు వైర్లు ఉన్నాయి. మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అయితే దగ్గరకు వెళ్లడానికి కూడా వీలు లేనంతగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.