శ్రీకాకుళం: శ్రీకాకుళం:కక్ష పూరిత రాజకీయాలకు తాము ఎప్పుడూ దూరంగా ఉంటామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.
కక్ష పూరిత రాజకీయాలకు తాము ఎప్పుడూ దూరంగా ఉంటామని కేంద్ర పౌర విమాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం దీనబంధు పురం గ్రామంలో పించన్ పంపిణీ కార్యక్రమంకు ఆయన పాల్గున్నారు.ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, తన బాబాయ్ అచ్చేంనాయుడు రాష్ట్ర మంత్రిగా, తాను కేంద్ర మంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత కూడా తమపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా అవాకులు, చవాక్కులు మాట్లాడుతున్నారని అయినా తాము వాటిని పట్టించుకోవడం లేదని తెలిపారు. తాము ప్రజల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తుల మని తెలిపారు