ఖమ్మం అర్బన్: జిల్లాలో దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా కృషి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
జిల్లాలో దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా కృషి చేస్తున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డు (UDID) పొందే విధానంపై దివ్యాంగులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ దివ్యాంగులందరికి హక్కులు కల్పించే చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు.