కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.... ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కిందన్నారు. ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు నేడు అనేక రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయంటే అది ఎన్టీఆర్ ఘనత అన్నారు.