షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ మంచిర్యాల నుంచి వస్తున్న ఆల్టో కార్ ను ఢీ కొట్టి సుమారు 30 మీటర్ల దూరం ఈడ్చికెళ్లాడు. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని షామీర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు.