కామేపల్లి: 12న నూలిపురుగుల మాత్రలు పంపిణీ కామేపల్లి పలు శాఖల అధికారులు
నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నులిపురుగుల నివారణతో చిన్నారులకు ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని.కామేపల్లి ఎంపీడీవో కె.విజయ భాస్కర్ రెడ్డి,తహసిల్దార్ సిహెచ్. సుధాకర్,డాక్టర్ యన్.చందన పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 12న 1నుండి19 సంవత్సరాల పిల్లలుకు తప్పనిసరిగా నులిపురుగుల మాత్రలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఈనెల 19 లోగా 100% నివారణ మాత్రలు అందించే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.