ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు త్వరగా యూనిఫామ్స్ అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. యూనిఫామ్ పంపిణీపై సంబంధిత అధికారులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలన్నారు