రాయదుర్గం: కురువళ్ళి శివారులో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్టు : ఎస్ఐ నభిరసూల్
బొమ్మనహాల్ మండలంలోని కురువళ్ళి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ నభిరసూల్ తెలిపారు. శుక్రవారం మద్యాహ్నం తమకు రాబడిన సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించగా 11 మంది పేకాటరాయుళ్ళు పట్టుబడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 21250 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.