తాడిపత్రి: తాడిపత్రిలోని గన్నె వారి పల్లి కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రి పట్టణ పరిధిలోని గన్నె వారిపల్లి కాలనీలో మంగళవారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను దశలవారీగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.