గండిమైసమ్మ హైవే నుంచి కైసర్ నగర్ కు వచ్చే రోడ్డుపై అనుమతులు లేకుండా రోడ్డును ఆక్రమించి నిర్మించిన షెడ్ లపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు ధర్నా చేపట్టారు. ఆ పార్టీ నేత ఆకుల సతీష్ మాట్లాడుతూ అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ స్థలంలో బఫర్ జోన్ లో 12 అక్రమ షెడ్ల నిర్మాణం చేసి లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై సోమవారం అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ, బీసీ మల్లారెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు.