నంద్యాల జిల్లా అవుకు మండలంలోని కునుకుంట్ల గ్రామం సమీపాన ఉన్న టేక్కే స్వామి ఉరుసు ఈ నెల 5,6 తేదీలలో జరుగుతుంది. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం అవుకు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో దర్గాను మంగళవారం సందర్శించారు. దర్గా కమిటీ సభ్యులతో, నిర్వాహకులతో మాట్లాడి ట్రాఫిక్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని నిర్వాహకులతో మాట్లాడారు.