నేరేడుచర్ల: నేరేడుచర్లలో భూభారతి దరఖాస్తులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాంబాబు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం భూభారతి సదస్సు దరఖాస్తులను అడిషనల్ కలెక్టర్ రాంబాబు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులకు నోటీసుల ప్రక్రియను ఆదివారం వరకు పూర్తి చేయాలని ఆయన సూచించారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించి కార్యాలయ సిబ్బందికి తగు సూచనలను చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.