మేడ్చల్: ఉప్పల్ లో నకిలీ వస్తువుల వ్యాపారాన్ని గుట్టురట్టు చేసిన ఎస్వోటీ పోలీసులు
ఉప్పల్‌లోని రాందేవ్ కిరాణా షాపు ముసుగులో జరుగుతున్న నకిలీ వస్తువుల వ్యాపారాన్ని ఎస్వోటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. షాపు గోదాం పై దాడి చేసి భారీగా డూప్లికేట్ హార్పిక్, టాయిలెట్ క్లీనర్, పారాచూట్ హెయిర్ ఆయిల్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో హార్పిక్ బాటిల్లు 192, టాయిలెట్ క్లీనింగ్ బాటిల్స్ 70, పారాచూట్ హెయిర్ ఆయిల్ బాటిళ్లు 288 ఉన్నాయి. షాప్ యజమాని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.