కొత్తగూడెం: సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటను కేటాయించాలి :SCCWU-IFTU రీజనల్ కార్యదర్శి నాగేశ్వరరావు
సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటను కచ్చితంగా కేటాయించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ ప్రధాన కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు.భుధవారం కొత్తగూడెం రైటర్ బస్తీలో జరిగిన సమావేశం కు రీజియన్ అధ్యక్షులు మోత్కూరి మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.