కామారెడ్డి: దేవునిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనరల్ ఫిజీషియన్ సేవలు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు జనరల్ ఫిజీషియన్ సేవలు అందించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా తెలిపారు. జనరల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వారికి మందులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.