అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోర్టు ఉత్తర్వుల మేరకు తొలగించిన కార్మికులను విధులలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులతో కార్మిక నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులు అందించిన తరువాత కూడా వారిని విధులలోకి తీసుకోకపోవడం పై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని నిలదీశారు.