గుమ్మలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి
కురుపాం మండలం గుమ్మ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం ఉదయం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కొత్త సంవత్సరంతో అవ్వ, తాతల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.