హిందూపురాన్ని అశాంతి‘పురం'గా మారుస్తున్నారా అని ప్రశ్నించిన వైసీపీ నేత జయ కుమార్ రెడ్డి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోద్బలంతోనే ఆయన పీఏల ఆదేశాల మేరకు టీడీపీ గూండాలు హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బోలింగాలపాడు జయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టిడిపి శ్రేణులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించే ఇటువంటి అరాచక చర్యలు ఎప్పటికీ సహించబోవడం లేదని స్పష్టంచేశారు.