ఖానాపూర్: పోషణ్ భీ. పడాయ్ భీ కార్యక్రమంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన సిడిపిఓ శ్రీలత
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోషణ్ భీ. పడాయ్ భీ కార్యక్రమంపై 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగ మంగళవారం కడెం మండలం పెద్ద బెల్లాల్ రైతు వేదికలో కడెం,దస్తురాబాద్ 2 మండలాల అంగన్వాడీ టీచర్లకు సిడిపిఓ శ్రీలత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ కు వచ్చే పిల్లల పెరుగుదల, అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే పౌష్టికాహారం,ప్రీ స్కూల్ విద్య పట్ల అంగన్వాడి టీచర్లకు స్క్రీన్ పై వివరించి అవగాహన కల్పించారు. అన్ని అంగన్వాడి సెంటర్లలో పోషణ్ భీ. పడాయ్ భీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.