అసిఫాబాద్: ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల సమస్యల పరిష్కారానికి చర్యలు:జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కాగజ్ నగర్ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్, గురుకుల ప్రిన్సిపాళ్ళు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో కాగజ్ నగర్ పట్టణంలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కాగజ్ నగర్ లో ఏర్పాటుచేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 455 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా